Friday, January 29, 2021

అమ్మపాట

 



అమ్మపాట

అమ్మానను కన్న బుణము తీరేదెలమ్మా

భూదేవి కన్న గొప్ప గుణము నీదేకదమ్మా

కంటి పాపవు అయినవు

నా ఇంటికి దీపానివి అయినవు

జన్మకి మరుజన్మనిచ్చిన అమ్మా

నాలో జీవాత్మ వైనవమ్మా. || అమ్మా"


నవమాసాలు నీ కడుపున మోసావు

నీ ప్రాణాన్ని ఎరువుగా పోసావు

పెరిగే బరువును మోసినావమ్మా

నాకు ప్రేమతోనే జన్మ నిచ్చినవమ్మా. || అమ్మా"



పురిటి నొప్పుల్లోనే అమ్మా

నీ ఒళ్ళెంతో పుండైనది అమ్మా

బిడ్డకు నీవు జన్మ నివ్వ అమ్మా

నీ నిండు మనసు కోరుతుంది అమ్మా. || అమ్మా"


నెత్తురు ముద్ద అని అమ్మా

నను ఎత్తుకుని ముద్దాడి అమ్మా

అరిచేతుల్లో పెంచావు అమ్మా

కంటిరెప్పగ చూసావు అమ్మా

ఏమిచ్చి ఋణము తీర్చుకోనె అమ్మా

నీకు ఏసేవలు చేయనె మాయమ్మా.|| అమ్మాll


చను పాలతోనే శ్వాస పోసినావు

నాభావాలకు భాషవైనావు

జన్మకి మరుజన్మ నిచ్చినవమ్మా

నాలో సగభాగమైన అమ్మా

అరనిమిషమైన బిడ్డ అలిగితె అమ్మా

ఆ తల్లి గుండె తల్లడిల్లె నమ్మా

అలిగిన ఆవేళలోనె అమ్మా

ఆ అందాల చందమామ అమ్మా

అతడే నీకు మేన మామంటివమ్మా.|| అమ్మాll


కన్నతల్లి ప్రేమే మా అమ్మా

అది వెన్న కన్న మెత్తని మాయమ్మా

కన్న తల్లి మనసేమా యమ్మా

అది మల్లె కన్న తెల్లనె మాయమ్మా

డిల్లికి రారాజైనా అమ్మా

ఆ తల్లికి ముద్దుల కొడుకేనమ్మా

అరవై ఏండ్ల బిడైనా అమ్మా

ఆ తల్లికి అడ్డబాలే నమ్మా

ఏమిచ్చి ఋణము తీర్చుకోనె అమ్మా

నీకు ఏ సేవలు చేయనెమాయమ్మా

జన్మంతా సేవచేసిన గానమ్మా

నీ ఋణము తీర్చుకోలేను అమ్మా || అమ్మాll